భైంసాటౌన్: జనాభా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. పట్టణంలో ని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మాస్టర్ ప్లాన్ అమలుపై రెండో కన్సల్టేటివ్ వ ర్క్‌షాప్ నిర్వహించి మాట్లాడారు. మాస్టర్‌ప్లా న్ ముసాయిదాపై సందేహాలు, అభ్యంతరా లుంటే అధికారులకు తెలుపాలని సూచించా రు. ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడు తూ.. మాస్టర్ ప్లాన్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా రూపొందించాలని సూచించారు. అంతకుముందు డీటీసీపీ ఏడీ అశ్విని ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి సందేహాలను నివృత్తి చేశారు. సబ్‌కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్, బ ల్దియా చైర్మన్ దత్తాత్రి, వైస్ చైర్మన్ కుతిజా సిద్ది కీ, ఏఎస్పీ సాయికిరణ్, కమిషనర్ సంతో ష్‌కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులున్నారు.
ఎస్‌ఐఆర్‌పై పార్టీల నేతలతో సమావేశం
నిర్మల్ రూరల్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్‌ఐఆర్‌పై వివిధ రాజకీయ పార్టీల ప్రతి నిధులతో కలెక్టర్ భవేశ్ మిశ్రా సమావేశమై మాట్లాడారు. ఫామ్–6, 8 దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం, తిరస్కరణకు గల ప్రధాన కా రణాలు వివరించారు. అదనపు కలెక్టర్లు వెంక ట మాధవరావు, రాథోడ్ రమేశ్, భైంసా సబ్ క లెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, ఉట్నూర్ సబ్ క లెక్టర్ ప్రణయ్‌కుమార్, ఆర్డీవో దేవీదాస్, డి ప్యూటీ కలెక్టర్ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
పీఎం రాహత్ అమలుపై సమీక్ష
కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎం రాహత్ పథకం అమలుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించా రు. రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వై ద్యసేవలందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధికారులు తిరుపతి, అసీఫ్, రజినీకాంత్ తదితరులున్నారు.


