నిర్మల్టౌన్: నిర్మల్ నుంచి 6 జ్యోతిర్లింగాల యాత్రకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు మంగళవారం బయల్దేరింది. దీనిని డిపో మేనేజర్ కే.పండరి నిర్మల్ బస్టాండ్లో పూజలు చేసి ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా నాందేడ్ గురుద్వారా, భద్ర మారుతి, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఎల్లోరా, శని శింగణాపూర్, షిరిడీ, నాసిక్, త్రయంబకేశ్వర్, నిష్కలంక మహాదేవ్, సోమనాథ్ జ్యోతిర్లింగం, ద్వారక, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, ఉజ్జయిని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలను భక్తులు దర్శించుకుంటారని వివరించారు. ఈ నెల 27న బయలుదేరిన బస్సు నవంబర్ 2న తిరిగి నిర్మల్ చేరుకుంటుందని డిపో మేనేజర్ తెలిపారు. నిర్మల్ డిపో పరిధిలో వివిధ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. వచ్చే నెలలో కర్ణాటక యాత్రకు కూడా ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో మంత్రాలయం, హంపి, కుక్కే సుబ్రహ్మణ్య, ధర్మస్థల, ఉడుపి, మురుడేశ్వర్, గోకర్ణ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. యాత్ర తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.వివరాలకు 9959226003, 9440018549 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.


