నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పీఎంశ్రీ పాఠశాలల జిల్లాస్థాయి బాల, బాలికల కబడ్డీ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. డీఈవో భోజన్న, జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పీఎంశ్రీ పాఠశాలలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను నవంబర్ 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు డీఈవో తెలిపా రు. కార్యక్రమంలో నిర్మల్ ఎంఈవో పద్మ, సెక్టోరియల్ అధికారి నర్సయ్య, సైన్స్ అధికారి వినోద్ కుమార్, పీఈటీ సంఘం అధ్యక్షుడు అంబాజీ, కార్యదర్శి భూమన్న, సత్తయ్య, మూడరపు పరమేశ్వర్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


