ఖానాపూర్: పట్టణంలోని కుమురంభీం చౌరస్తాలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2 కోట్లతో నిర్మించనున్న అగ్నిమాపక కేంద్రానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు అగ్నిమాపక శాఖ కీలకమన్నారు. ఖానాపూర్‌లో ఫైర్‌స్టేషన్ ఏర్పాటుతో ప్రమాదాలు జరిగినప్పుడు సత్వరమే స్పందించి మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని తెలిపారు. ఫైర్‌స్టేషన్ పూర్తయితే ఖానాపూర్‌తోపాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అంకం మౌనిక మహేందర్, వైస్ చైర్మన్ సోయబ్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, కౌన్సిలర్లు, నాయకులు తొడసం ఇందిర, చిన్నం సత్యం, నిమ్మల రమేశ్, గుమ్ముల ఆనంద్, గొర్రె గంగాధర్, ప్రకాశ్‌గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాజిద్, జిల్లా ఇన్‌చార్జి అగ్నిమాపక అధికారి భగవాన్‌రెడ్డి, ఖానాపూర్ ఫైర్‌స్టేషన్ అధికారి శ్రీనివాస్, అధికారులు శివాజి, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు.


