● డీసీసీ చీఫ్ వెడ్మ బొజ్జు పటేల్
నిర్మల్‌చైన్‌గేట్: నవంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘‘ఓట్ బచావో – దేశ్ బచావో’’ జాతీయ ర్యాలీని విజయవంతం చేసే లక్ష్యంతో మంగళవారం నిర్మల్‌లోని మారుతి ఇన్ హోటల్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి, అబ్జర్వర్ సీడీ.మేయప్పన్, ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌రావు హాజరయ్యారు. నవంబర్ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులను తరలించడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఓటు హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సంరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘‘ఓట్ బచావో – దేశ్ బచావో’’ జాతీయ ర్యాలీని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో నిర్మల్, ము ధోల్ నియోజకవర్గ ఇన్‌చార్జీలు కుచాడి శ్రీహరిరావు, నారాయణరావు పటేల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


