ముధోల్/భైంసారూరల్: విద్యార్థులు చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ పోరిక రవీందర్ అన్నా రు. సురక్షిత్ బచ్పన్ అభియాన్‌లో భాగంగా ముధోల్‌లోని రబీంద్ర పాఠశాలలో, చుచుంద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించా రు. బాలల హక్కులు, విధులను, సైబర్ క్రైమ్ గురించి తెలిపారు. అన్యాయం జరిగినప్పుడు కోర్టు ద్వారా ఎలా న్యాయం పొందాలో తెలి యజేశారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మైనర్లు డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. మొబైల్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ఎస్సైలు బిట్లా పెర్సిస్, సుప్రియ, ప్రిన్సిపాల్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, హెచ్‌ఎం వెంకటేశ్వర్, సర్పంచ్ రాచేవాడ్ గణేశ్, కార్యదర్శి సురేశ్, ఉపాధ్యాయులు, పోలీసులు పాల్గొన్నారు.


