నిర్మల్‌లో..
పోలీస్ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్మల్, భైంసా పట్టణాల్లో పోలీసులు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. భైంసా పోలీస్ స్టేషన్ నుంచి నిర్మల్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, భైంసా ఏఎస్సీ సాయికిరణ్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల సేవలను ఎప్పటికీ మరువలేమన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ.. ప్రతీ పోలీస్ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. – నిర్మల్‌టౌన్/భైంసాటౌన్
భైంసాలో..


