‘ప్రజా’ సమస్యలు.. ఎప్పటికప్పుడు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

‘ప్రజా’ సమస్యలు.. ఎప్పటికప్పుడు పరిష్కారం

Oct 27 2026 12:32 AM | Updated on Oct 27 2026 12:32 AM

● అదనపు కలెక్టర్లు రాథోడ్‌ రమేశ్‌, వెంకట మాధవరావు ● రెవెన్యూ రికార్డుల్లో వివరాలు నమోదు చేయాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రజావాణికి అర్జీల రూపంలో వచ్చే వివిధ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు రాథోడ్‌ రమేశ్‌, వెంకట మాధవరావు ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూసమస్యలకు సంబంధించి దరఖాస్తులు సమర్పించారు.

నాకు నిర్మల్‌ రూరల్‌ పరిధిలోని కౌట్ల(కే) గ్రామంలో సర్వే నంబర్‌ 523/ఆ/2 లో 1.20 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూమిని రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించారు. ధరణి సర్వే సమయంలో తన భూమిని కొలిచినప్పటికీ రికార్డుకు ఎక్కించలేదు. రెవెన్యూ అధికారులకు అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు.

– సురకంటి హన్మంత్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement