నిర్మల్‌చైన్‌గేట్: వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేశ్, వెంకట మాధవరావు హాజరై వాల్మీకి చిత్రపటానికి పూ లమాలలు వేసి నివాళులర్పించారు. బోయవా డు గొప్ప కవిగా మారిన తీరు వాల్మీకి జీవితా నికి నిదర్శనమన్నారు. వేడుకల్లో డిప్యూటీ కలెక్టర్ రాకేశ్, బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివా స్, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్, వాల్మీకి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో..
నిర్మల్‌టౌన్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. అనంతరం మాట్లాడుతూ రామాయణంలోని ఆదర్శాలు నేటి సమాజానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. వాల్మీకి రచించిన రామాయణం ధర్మం, సత్యం, న్యాయం, మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ అధికారి నర్సమ్మ, ఆర్‌ఐలు రామనిరంజన్, శేఖర్, రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు, ఐటీ కోర్, డీసీఆర్‌బీ, ఫింగర్‌ప్రింట్, కమ్యూనికేషన్ విభాగాల, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


