నిర్మల్‌చైన్‌గేట్: ఆదివాసీ వీరుడు కొమురంభీం 86వ వర్ధంతిని సోమవారం నిర్మల్‌లో ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ నాయక పోడు సంఘం జిల్లా అధ్యక్షుడు సాకి లక్ష్మణ్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమ య్య మాట్లాడుతూ నిజాంపై పోరాడిన భీం త్యాగం యావత్ ఆదివాసీ సమాజానికి స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. భీం ఆశయాలను కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో చూపాలని, ఆయన చరిత్రను భావితరాలకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భీం వర్ధంతి ఒకే జిల్లాకు లేదా ఉమ్మడి ఆదిలా బాద్‌కే పరిమితం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధి కారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముసలి చిన్నయ్య, ఉపాధ్యక్షులు సుంచు సవీన్, రమేశ్, తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి తోడుసం గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


