యువతకేది భరోసా? | - | Sakshi
Sakshi News home page

యువతకేది భరోసా?

Oct 23 2026 12:03 AM | Updated on Oct 23 2026 12:03 AM

● తెరుచుకోని పీఎంఈజీపీ వెబ్‌సైట్‌ ● దరఖాస్తుకు చాన్స్‌ లేక ఆందోళన

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎం ఈజీపీ) నిరుద్యోగ యువతకు అందకుండా పోతోంది. ఏటా మార్చిలో ఈ పథకం ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలైనా నేటికీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. పథకం గురించి ప్రభుత్వం గొప్పగా ప్రచారమే చేయడమే గాని ఆచరణలో లబ్ధిదారులకు సరైన ఫలాలు అందించిన దాఖలాలు లేవు.

అవగాహన మాత్రం అదుర్స్‌..

పీఎంఈజీపీ పథకాన్ని నిరుద్యోగులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సర్వీస్‌ సెక్టార్‌కు రూ.20 లక్షల వరకు రుణం లభిస్తుందని, దీనిని గ్రామీణ ప్రాంతంలో నెలకొల్పితే సదరు లబ్ధిదారు తీసుకున్న రుణం మొత్తంలో 35శాతం, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే 25శాతం సబ్సిడీ లభిస్తుందని చెబుతున్నారు. అంతే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్‌ కోసం ఒక్కో వ్యక్తికి రూ.50 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉందని, దీనిని కూడా రూరల్‌ ఏరియాలో ఏర్పాటు చేసుకుంటే 35శాతం, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటే 25శాతం సబ్సిడీ పొందవచ్చని చెబుతున్నారు. జనరల్‌ కేటగిరీకి చెందిన (మెన్‌) కు మాత్రమే సబ్సిడీ తక్కువగా ఉంటుందని క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో నిరుద్యోగులు ఎంతో ఆశగా దరఖాస్తు చేసుకుందామనుకుంటే వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవటంతో నిరాశ, నిస్పృహలో ఉన్నారు.

పథకానికి అర్హతలు ఇవే..

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు 18ఏళ్లు నిండి ఉండాలి. ఎనిమిదో తరగతి చదువుకున్నవారు అర్హులు. వ్యక్తిగతంగానే కాకుండా స్వయం సహాయ క సంఘాల (ఎస్‌హెచ్‌ఎస్‌) సభ్యులూ దరఖాస్తు చేసుకోవచ్చు. రుణాలు పొంది పరిశ్రమ ఏర్పాటు చేసుకున్న తర్వాత పోస్టల్‌ శాఖ అధికారులు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తారు. అప్పుడు సబ్సిడీ లభిస్తుంది. పరిశ్రమ ఏర్పాటు చేసిన తర్వాత కనీసం మూడేళ్లపాటు యూనిట్‌ను తప్పనిసరిగా నిర్వహించాలనే నిబంధన ఉంది.

బ్యాంకర్లు కరుణ చూపితేనే..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే బ్యాంక్‌ అధికారుల అనుగ్రహం తప్పనిసరి. లేకుంటే సబ్సిడీ పథకాలు లబ్ధిదారులకు చేరవు. రుణం తీసుకోవాలనుకునే సర్వీస్‌ బ్యాంకులో కొన్నాళ్ల పాటు అకౌంట్‌ కలిగి ఉండి, ఇతర రుణాలు తీసుకుని వాటిని సకాలంలో చెల్లించి ఉండాలనే నిబంధన ఉంది. సకాలంలో చెల్లించకుంటే సిబిల్‌ స్కోర్‌ సరిగా లేదని బ్యాంకర్లు రుణం ఇచ్చేందుకు నిరాకరించే అవకాశముంది.

ఆందోళనలో నిరుద్యోగ యువత

జిల్లాలో చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు. దీంతో నిరుద్యోగులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉపాధి కల్ప న (పీఎంఈజీపీ) పథకం ద్వారా సబ్సిడీ రుణాలు పొంది చిన్నపాటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకులు, పరిశ్రమల శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభం అనగా, మార్చి లోనే రుణాలు పొంది వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారు. ముందుగా పీఎంఈజీపీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకో వాల్సి ఉంటుంది. అయితే, నేటికీ లాగిన్‌ ఓపె న్‌ కావడం లేదని పలువురు నిరుద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే పుణ్యకాలం గడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement