ప్రచారం సరే.. ఆదాయమేది? | - | Sakshi
Sakshi News home page

ప్రచారం సరే.. ఆదాయమేది?

Oct 23 2026 12:03 AM | Updated on Oct 23 2026 12:03 AM

● అనుమతి లేకుండా ఫ్లెక్సీల ఏర్పాటు ● ఆదాయం కోల్పోతున్న మున్సిపాల్టీ

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా భారీ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. నూతన వస్త్ర దుకా ణాల ఏర్పాటు, పండుగలు, గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, రాష్ట్ర, స్థానిక నాయకుల పుట్టిన రోజులు, ముఖ్య నాయకులు, మంత్రుల రాక.. ఇలా సందర్భమేదానా అధి కార, ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు మున్సిపాలిటీ అనుమతి తీసుకోవడంలేదు. జిల్లాకేంద్రంలో పదేళ్లకుపైగా తంతు యథేచ్ఛగా కొనసాగుతుండగా, బల్దియా ఆదాయం కోల్పోతోంది.

అడ్డూ అదుపు లేకుండా..

వాస్తవానికి ప్లెక్సీల ఏర్పాటుకు మున్సిపాలిటీ అనుమతి తీసుకోవాలి. నిర్దేశించిన రోజులకు రుసుము కూడా ఒకేసారి చెల్లించి అధికారులు సూచించిన ప్రాంతంలోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలి. వచ్చి న ఆదాయాన్ని మున్సిపాలిటీ అభివృద్ధికి వెచ్చించాలని స్పష్టమైన నిబంధనలున్నాయి. కానీ, బల్ది యా అధికారులు.. రాజకీయ నాయకులను ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నందున ఫ్లెక్సీల ఏర్పా టు వ్యవహారం అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రచార ఆదాయంపై అశ్రద్ధ

ఏటా ఆస్తి, ట్రేడ్‌ లైసెన్స్‌, కుళాయి పన్ను వసూళ్లపై దృష్టి సారిస్తున్న అధికారులు ప్రచార ఆదాయంపై శ్రద్ధ చూపడం లేదు. దీంతో బల్దియా రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతోంది. అలాగే, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు నెలల తరబడి అలాగే ఉండటంతో రహదారుల ఎదురుగా ఉండే దుకాణాదారులు, వాహనాల పార్కింగ్‌కు అసౌకర్యం కలుగుతోంది. పుర అభివృద్ధికి దోహదపడాల్సిన ప్రజాధనం దుర్వినియోగం పాలవుతోంది. ఏ పార్టీ పాలకవర్గం కొలువుదీరినా ఫ్లెక్సీల ఏర్పాటుకు పాటించాల్సిన నిబంధనలపై ఆలోచించినట్లు కనిపించలేదు. అధికారులూ ఆ దిశగా కార్యాచరణ చేపట్టిన దాఖలాలూ లేవు. జిల్లాకేంద్రంలో ప్రధాన చౌరస్తాలైన శివాజీ చౌక్‌, అంబేడ్కర్‌ చౌక్‌, గాంధీచౌక్‌, కొత్తబస్టాండ్‌, పాతబజార్‌, బస్‌ డిపో రోడ్డు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ చౌరస్తా తదితర ప్రదేశాల్లో ఫ్లెక్సీలు అధికంగా ఏర్పాటు చేస్తున్నారు.

రోడ్డు మధ్యలోని మొక్కలపై..

ఫ్లెక్సీల మధ్యలో నలిగిపోతున్న మొక్క

అనుమతి తప్పనిసరి

మున్సిపాలిటీ పరిధిలో ఫ్లెక్సీల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ఇందుకుగాను పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తాం.

– రవిబాబు, మున్సిపల్‌ కమిషనర్‌, నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement