ఫ్లైఓవర్‌ ప్రాంతం.. ప్రమాదాలకు నిలయం | - | Sakshi
Sakshi News home page

ఫ్లైఓవర్‌ ప్రాంతం.. ప్రమాదాలకు నిలయం

Oct 23 2026 12:03 AM | Updated on Oct 23 2026 12:03 AM

బాసర: బాసర రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఫ్లైఓవర్‌ ముగింపు ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మా రింది. ఫ్లైఓవర్‌ చివరలో ఏర్పాటు చేసిన స్పీడ్‌ బ్రేక ర్లు అశాసీ్త్రయంగా, మరీ ఎత్తుగా ఉండటంతో వాహనాలు అదుపుతప్పుతుండగా వాహనదారులు కిందపడి గాయపడుతున్నారు. రాత్రి వేళ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా నిజామాబా ద్‌ జిల్లా గుండారం మండల కేంద్రానికి చెందిన ఇద్ద రు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై బాసరకు వస్తుండగా ఫ్లైఓవర్‌ స్పీడ్‌బ్రేకర్‌ వద్ద ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనా స్థలాన్ని గమనించిన పోలీసులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను బాసర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. కాగా, స్పీడ్‌బ్రేకర్ల ఎత్తు తగ్గించాలని, ఫ్లైఓవర్‌పై ప్రమాద హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement