కాలం మిగిల్చిన నెత్తుటి జ్ఞాపకాలు విధినిర్వహణలో ప్రాణత్యాగాలు నక్సలైట్ల దాడుల్లోనే మరణాలు అమరులను స్మరిస్తూ.. సంస్మరణోత్సవాలు వారం పాటు వివిధ కార్యక్రమాలు
న్యూస్‌రీల్
సీతాఫలాలపై ఎల్‌నినో పంజా
ఎల్‌నినో ప్రభావం సీతాఫలాలపై పడింది. సరైన నీటి వసతి లేకపోవడంతో ఎక్కువ కాయలు కాయలేదు. అలాగే కాయల పరిమాణం తగ్గింది.
IIలోu
సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
నిర్మల్‌చైన్‌గేట్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని తొమ్మిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా దృష్టికి తీసుకెళ్తామని ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్‌గౌడ్ అన్నారు. బుధవారం ఉద్యోగులకు సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా 17,000 మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వీరికి కనీసం ’మినిమమ్ టైమ్ స్కేల్’ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నాయకులు వేణుగోపాలరావు, సాయిబాబా, రమణారెడ్డి, భోజరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సదానంద్ గౌడ్, సలీం, సరస్వతి, ఉషారాణి, ఎన్‌హెచ్‌ఎం సంఘ నాయకులు ముత్యం, గంగాధర్, రమణ, డాక్టర్ రమేశ్, అలీ, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్/ఖానాపూర్: తుపాకుల మోతలు నిలిచిపోయాయి. అడవుల్లో అలజడి ఆగిపోయింది. నెత్తుటి చరిత్రకు కాలం తెరదించింది. కానీ.. నాటి చేదు జ్ఞాపకాలు మాత్రం చెదరడం లేదు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. అమరుల కుటుంబాలను ఓదారుస్తూ, సహచరులను తలుస్తూ ఏటా ఖాకీచొక్కాలు కన్నీటితో తడుస్తున్నాయి. ఒకప్పుడు నక్సలైట్ల కార్యకలాపాలతో అట్టుడికిన జిల్లా ఎన్నో విషాద ఘటనలకు సాక్షిగా నిలిచింది. తుపాకీ తూటాలకు, మందుపాతరల పేలుళ్లకు తమవాళ్లను కోల్పోయిన పోలీసుల కుటుంబాల్లో చెరగని ముద్ర వేశాయి. వారి జీవితాలు వృథాపోలేదని, ప్రాణత్యాగాలనూ మరువలేదని పోలీసుశాఖ ఏటా అక్టోబర్ 21న ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినం’ నిర్వహిస్తోంది. వారం పాటు వివిధ కార్యక్రమాలు చేపడుతూ అమరుల స్ఫూర్తిని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది.
ఈ ప్రాంతమే కీలకం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నక్సలైట్ల ప్రభావంతో కూడిన ప్రత్యేక చరిత్ర ఉంది. నక్సలైట్లు–పోలీసుల హోరాహోరీ పోరులో ఈ ప్రాంతం కీలకంగా నిలిచింది. ప్రధానంగా 1980వ దశకం నుంచి ప్రస్తుత నిర్మల్ జిల్లాలోని అటవీ గ్రామాల్లో నక్సలైట్ల కార్యకలాపాలు క్రమంగా విస్తరించాయి. దట్టమైన అడవులు, గుట్టలు, మారుమూల గ్రామాలు వారికి అనుకూలంగా మారాయి. ఈ ప్రాంతాలను స్థావరాలుగా చేసుకుని ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూ కార్యకలాపాలు కొనసాగించేవారు. మరోవైపు వారి కదలికలను అడ్డుకోవడం, శాంతిభద్రతలను పరిరక్షించడం పోలీసులకు సవాలుగా మారింది.
పచ్చని అడవుల్లో నెత్తుటి మరకలు..
అడవుల ఖిల్లాగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మైదాన ప్రాంతంతో పోలిస్తే అటవీ ప్రాంతాలు, సమీప ఏరియాల్లోనే నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. జిల్లాలో ప్రధానంగా ఖానాపూర్ ప్రాంతంలో ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉండేవి. మాటువేసి కాల్పులు జరపడం, మందుపాతరలతో వాహనాలను పేల్చివేయడం వంటి ఘటనలు పోలీసు యంత్రాంగాన్ని కలవరపరిచాయి. పచ్చటి అడవుల్లో నెత్తుటి మరకలు ఇప్పటికీ ఆనాటి ఘటనలను గుర్తుకు చేస్తాయి. ఒక్క ఖానాపూర్ సర్కిల్ పరిధిలోనే పలు దాడుల్లో 19 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
సింగాపూర్‌లో జీపు పేల్చివేత..
1989 ఫిబ్రవరి 1న.. మరో విషాద ఘటన. అంతకు ఒక్కరోజు ముందు ఖానాపూర్ మండలంలోని రాజూరాలో నక్సలైట్లు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆరా తీసేందుకు పోలీసులు వెళ్తుండగా, కడెం మండలం సింగాపూర్ సమీపంలో వారి జీపును నక్సలైట్లు పేల్చివేశారు. ఈ దాడిలో ఎస్సై ఖాదర్ ఉల్‌హక్‌తో పాటు కానిస్టేబుళ్లు జి.బాపురావు, ఎండీ జలీల్, షేక్ హైదర్, వేణుగోపాల్, భోజారావు, ఎస్.మోహన్‌దాస్ ప్రాణాలు కోల్పోయారు. ఒక కానిస్టేబుల్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
వారి త్యాగాలు మరువలేం..
ప్రాణాలనూ లెక్కచేయకుండా విధినిర్వహణే పరమావధిగా భావించి, తమ నిండుప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరులను ఎప్పటికీ మర్చిపోలేం. వారి త్యాగాలు ఎప్పుడూ స్ఫూర్తి నిస్తూనే ఉంటాయి. జిల్లాలోనూ అమరుల జ్ఞాపకార్థం సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం.
– జానకీ షర్మిల, ఎస్పీ
అల్లంపల్లిలో ఘటన వివరాలు తెలుసుకుంటున్న అప్పటి ఎస్పీ (ఫైల్)
ప్రాణత్యాగాలను స్మరిస్తూ..
కాలక్రమంలో నక్సలైట్లు (మావోయిస్టులు) కనుమరుగైనా.. ఆ రోజుల్లో జరిగిన దాడులు, కోల్పోయిన పోలీసుల ప్రాణాలు చరిత్రలో చెరిగిపోని గుర్తులుగా మిగిలాయి. కుటుంబాలకు దూరమై విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలను ఆ శాఖ గుర్తుపెట్టుకుంటోంది. ఏటా అక్టోబర్ 21న సంస్మరణ దినోత్సవం, వారంపాటు విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, ఓపెన్‌హౌస్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జిల్లాకేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థూపం వద్ద, 2008లో ఖానాపూర్‌లో నిర్మించిన అమరుల స్థూపం వద్ద ఏటా అమరుల కుటుంబసభ్యులతో కలిసి పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పిస్తున్నారు.


