గంగమ్మ ఒడికి దుర్గామాత | - | Sakshi
Sakshi News home page

గంగమ్మ ఒడికి దుర్గామాత

Oct 22 2026 12:09 AM | Updated on Oct 22 2026 12:09 AM

జిల్లా కేంద్రంలో దుర్గామాత నిమజ్జనోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు తమ ఆరాధ్య దైవానికి భావోద్వేగాలతో వీడ్కోలు పలికారు. ఉదయం ప్రారంభమైన అమ్మవారి శోభాయాత్ర సాయంత్రం వరకు నిర్మల్‌ పట్టణ వీధుల్లో కోలాహలంగా కొనసాగింది. భక్తుల డప్పు చప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ కోలాటాలు ఆడుతూ, భక్తి గీతాలకు ఉత్సాహంగా ఆడిపాడారు. అమ్మవారి నామస్మరణతో పట్టణం మార్మోగింది. శోభాయాత్ర అనంతరం అమ్మవారి విగ్రహాలను వినాయక సాగర్‌లో నిమజ్జనం చేశారు. ‘జై దుర్గామాత‘ నినాదాల మధ్య అమ్మవారికి కన్నీటి వీడ్కోలు పలుకుతూ వచ్చే ఏడాదికి మళ్లీ రావాలని వేడుకున్నారు. – నిర్మల్‌చైన్‌గేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement