వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Oct 22 2026 12:09 AM | Updated on Oct 22 2026 12:09 AM

వాతావరణం ● ఎస్పీ జానకీ షర్మిల

ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. రాత్రి మంచు కురుస్తుంది.

ఆపద ఏదైనా

గుర్తుకొచ్చేది పోలీసులే

నిర్మల్‌టౌన్‌: ఆపద ఏదైనా ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులేనని, ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తూ ఎన్నో త్యాగాలు చేస్తున్నారని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 1959 అక్టోబర్‌ 21న లడఖ్‌ సరిహద్దులో చైనా సైనికులతో పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల స్మారకంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని రక్షిస్తే, అంతర్గత భద్రతను కాపాడుతూ ప్రజలకు భరోసా కల్పించేది పోలీసులేనన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం అదనపు ఎస్పీ ఉపేందర్‌ రెడ్డి ఈ ఏడాది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల పేర్లతో కూడిన రోల్‌ ఆఫ్‌ హానర్‌ను చదివి వినిపించారు. ఈ భైంసా ఏఎస్పీ సాయి కిరణ్‌, డీఎస్పీ పి.శ్రీనివాస్‌, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement