సంచలనం.. అల్లంపల్లి ఘటన | - | Sakshi
Sakshi News home page

సంచలనం.. అల్లంపల్లి ఘటన

Oct 22 2026 12:09 AM | Updated on Oct 22 2026 12:09 AM

1987 ఆగస్టు 18.. కడెం మండలం అల్లంపల్లి క్యాంపునకు పోలీసులు నడుచుకుంటూ వెళ్తుండగా అద్దాల తిమ్మాపూర్‌ సమీపంలో సుమారు 30 మంది నక్సలైట్లు మాటువేసి పక్కా వ్యూహంతో ఒక్కసారిగా వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, ఏడుగురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు కానిస్టేబుళ్లు తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. గందం రామస్వామి అలియాస్‌ సాగర్‌ అనే దళ కమాండర్‌ నేతృత్వంలో ఈ దాడి జరిగినట్లు అప్పటి వివరాలు పేర్కొన్నాయి. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు చేపట్టారు. గిరి గ్రామాల్లో స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించడం, గిరిజన ఉపాధ్యాయులు, ఉద్యోగుల నియామకానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలకు ఈ ఘటనే కారణమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement