ఖానాపూర్: బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం ఖానాపూర్ విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఈ నెల 24న మస్కాపూర్‌లో నిర్వహించనున్న అఖిలపక్ష ప్రజాసంఘాల రౌండ్‌టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులగణనపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్, సహాయ కార్యదర్శి బుక్య సురేందర్, నవతెలంగాణ బీడీ యూనియన్ జిల్లా కార్యదర్శి కే.సంజీవ్, సీపీఐ (ఎంఎల్) నాయకుడు దేవ భోజన్న, బీఎల్‌ఎఫ్ నాయకులు సూర రాజన్న, బి.నరసయ్య, బీడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు చుక్కల కళ, అఖిల భారత మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి.స్వరూప, తదితరులు పాల్గొన్నారు.


