ఖానాపూర్: దసరా పండుగ సందర్భంగా పాలపిట్టను బంధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఖానాపూర్ ఎఫ్‌డీవో కడారి అనిత హెచ్చరించారు. అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదేశాల్లోనే పాలపిట్ట ప్రతిమను వీక్షించాలని తెలిపారు. పట్టణంలోని మస్కాపూర్ అర్బన్ పార్క్‌లో సోమవారం పాలపిట్ట ప్రతిమ, పాలపిట్ట సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు వివరించే పోస్టర్లు ఆవిష్కరించారు. పాలపిట్టను బంధించినా, బంధించేందుకు ప్రయత్నించినా వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మస్కాపూర్ అర్బన్ పార్కులో పాలపిట్ట ప్రతిమను వీక్షించేందుకు, జమ్మి ఆకులను సేకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఖానాపూర్ డివిజన్‌లోని వివిధ మార్కెట్ ప్రాంతాలు, పలు పంచాయతీల వద్ద పాలపిట్ట నమూనాలను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
దసరా నుంచి మార్నింగ్ వాక్..
దసరా నుంచి మస్కాపూర్ అర్బన్ పార్కులో మార్నింగ్ వాక్ చేసేందుకు ప్రజలకు అవకాశం కల్పించనున్నట్లు ఎఫ్‌డీవో తెలిపారు. పార్కు అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు. పర్యావరణ పర్యాటకం, జీవవైవిధ్య పరిరక్షణ అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. ఖానాపూర్ డివిజన్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వో కిరణ్‌కుమార్, ఎఫ్‌బీవోలు నరేందర్, ముత్యం తదితరులు పాల్గొన్నారు.


