బాసర: గోదావరి వంతెనపై సోమవారం ఒక వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా గ్రామస్తులు సమయస్ఫూర్తితో వ్యవహరించి కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. బాసరకు చెందిన గెంటిల లింబాద్రి, పద్మారావు అనే గ్రామస్తులు నవీపేట్ నుంచి బాసరకు వస్తున్నారు. ఈ క్రమంలో గోదావరి బ్రిడ్జిపై ఒక వ్యక్తి నదిలోకి దూకేందు కు ప్రయత్నించడాన్ని వారు గమనించారు. వెంటనే అప్రమత్తమైన వారు ఆ వ్యక్తిని పట్టుకుని వెనక్కి లాగారు. నదిలో దూకకుండా నిలువరించి ప్రాణాలు కాపాడారు. అనంతరం ఈ ఘ టనపై బాసర పోలీసులకు సమాచారం అందించి, వారికి అప్పగించారు. ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు చాకచక్యంగా వ్యవహరించిన లింబాద్రి, పద్మారావులను బాసర గ్రామస్తులతో పాటు స్థానికులు అభినందించారు.


