నార్నూర్: ఆదివాసీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీక ఝరి నాగ్ భీడ్ మెస్రం పెర్సపెన్ దసరా పూజలను గాదిగూడ మండలం ఝరి గ్రా మంలో ఘనంగా నిర్వహించారు. సంప్రదాయబ ద్ధంగా నిర్వహించిన పూజల్లో మెస్రం వంశీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి మెస్రం వంశీయులు తరలివచ్చారు. పెన్ కటోడ మెస్రం నాగోరావ్, పెన్ పటేల్ మెస్రం అబాజీ, పెన్ పటడి (ప్రధాన్) మెస్రం నాందేవ్, ఉపాధ్యాయులు మెస్రం దన్ను, మెస్రం లింగు, మాజీ జెడ్పీటీసీ మెస్రం సోము, మెస్రం భీంరావ్, మెస్రం లక్ష్మణ్, మెస్రం మారుతి తదితరులు పాల్గొన్నారు.


