భైంసారూరల్: మండలంలోని పేండ్‌పల్లి గ్రామంలో ప్రాచీన చరిత్రకు సంబంధించిన అనేక విగ్రహా లు గుర్తించినట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు సోమవారం తెలిపారు. సుద్దవాగు ఒడ్డున గల ఈ గ్రామం వేల సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఈ గ్రామంలో చాళుక్యుల కాలం నాటి వినాయకుడు విగ్రహం, కాకతీ యుల కాలం నాటి శివలింగం, మూడు విభిన్నమై న వీరగల్లులను గుర్తించినట్లు తెలిపారు. గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువు వద్ద గోరక్షక వీరగల్లు విగ్రహం, చెరువు కట్ట కింద పొలం ఒడ్డు వద్ద గుర్రంపై యుద్ధానికి బయలుదేరిన వీరుని విగ్రహం, గ్రామానికి తూర్పు దిక్కున ఉన్న గంగమ్మ ఆలయం వద్ద మరొక వీరగల్లు విగ్రహాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఒకే గ్రామంలో వివిధ ప్రాంతాల్లో మూడు వీరగల్లుల విగ్రహాలు ఉండడం విశేషం. ఈ ప్రాచీన గ్రామం 9వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం మధ్యకాలంలో వైభవంగా వెలిగినట్లు చారిత్రక ఆధారం వల్ల తెలుస్తోంది. క్షేత్ర పర్యటనలో రాజేశ్వర్ రెడ్డి, సర్పంచ్ దేశెట్టి శ్రీనివాస్, ప్రముఖ గా యని అనిల, వీడీసీ సభ్యులు చందురెడ్డి, నర్సయ్య, మైపాల్ రెడ్డి, సాయన్న, అన్వేష్, మోహన్ రెడ్డి, మాణిక్యం పాల్గొన్నారు.


