సారంగపూర్: అడెల్లి మహాపోచమ్మ జాతర భ ద్రతా ఏర్పాట్లను ఎస్పీ జానకీ షర్మిల ఆది వారం పర్యవేక్షించారు. అడెల్లి మహాపోచమ్మ ఆభరణాలు తరలివెళ్లిన గ్రామాలతోపాటు తిరిగి వచ్చే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణ చేశారు. అనంతరం అడెల్లి ఆలయానికి ఆభరణాలను తరలించే మార్గంలో సారంగాపూర్‌కు చేరుకుని ఆభరణాలను ఆనవాయితీ ప్రకారం తలపై ఎత్తుకుని సారంగాపూర్ అడెల్లి మహాపోచమ్మ స్వా గత తోరణం వరకు మోసుకొచ్చారు. అలాగే ఆలయానికి ఆభరణాలను తరలించే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యే క పోలీసు బలగాల సహకారంతో ఆభరణాల ను సరైన సమయానికి ఆలయానికి చేర్చారు. ఆభరణాలకు భధ్రతగా నిలిచిన నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్ బృందానికి, ప్రత్యేక పోలీసు బలగాలను అభినందించారు.


