నిర్మల్‌చైన్‌గేట్: నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శని వారం ఐదో రోజుకు చేరుకుంది. జిల్లా ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ‘భిక్షాటన’ చే స్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. 20 ఏ ళ్లుగా చాలీచాలని వేతనాలతో ప్రాణాలను సై తం ఫణంగా పెట్టి వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ బ తుకుల్లో మార్పు రావడం లేదని ఆవేదన వ్య క్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు చేపడుతున్న ఈ పోరాటానికి పలు రాజ కీయ పక్షాల నాయకులు సమ్మె శిబిరాన్ని సందర్శించి పూర్తి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జిల్లా జేఏసీ నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


