న్యూస్‌రీల్
ధర పెరిగింది.. దిగుబడి తగ్గింది క్వింటాల్ పత్తి రూ.9,101 మంచి ధర పలకడంతో రైతుల్లో ఆశలు వర్షాభావంతో తగ్గిన పూత, కాత
నిర్మల్
ఖానాపూర్‌కు టీపీఎస్
ఖానాపూర్ పట్టణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్(టీపీఎస్) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బాలికల పాఠశాలను టీపీఎస్‌గా మార్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
నిర్మల్‌టౌన్: డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పోరిక రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గొల్లపేట్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్‌లో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్‌నెస్ అండ్ వెల్‌నెస్ నావిగేషన్ పథకంపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. యువత డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. న్యాయ సేవల చట్టాలు, సైబర్ నేరాలకు సంబంధించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఎల్‌ఏడీసీఎస్ కే.రాజలింగం, ఎకై ్సజ్ సీఐ భిక్షపతి, సైబర్ క్రైం ఎస్సై జి.ముత్యం, న్యాయవాది డాక్టర్ ఎస్.లింగయ్య, న్యాయవాదులు దేవీదాస్, రత్నం తదితరులు పాల్గొన్నారు.
భైంసా: రెండేళ్లుగా పత్తి దిగుబడి బాగా వచ్చింది. అయితే ధర మాత్రం పెద్దగా లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఇక ఈసారి దూదికి డిమాండ్ పెరిగింది. కుభీర్ మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ పత్తికి రూ.9,101 పలికింది. ఇది రైతుల్లో ఉత్సాహం నిండింది. అయితే వర్షాలు లేకపోవడంతో దిగుబడి తగ్గుతోంది. ఇప్పటికే వర్షాభావంతో చేలు ఎర్రబడుతున్నాయి. పూత, కాత తగ్గింది. కాసిన కాయలు కూడా చిన్నగా ఉన్నాయి. దీంతో దిగుబడి సగానికి పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్లు వచ్చే పత్తి ఈసారి 4 నుంచి 5 క్వింటాళ్లకే పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ధర ఎంతకాలం స్థిరంగా ఉంటుందన్నది కూడా రైతులను భయపెడుతోంది.
1.63 లక్షల ఎకరాల్లో సాగు..
ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో సుమారు 1.63 లక్షల ఎకరాల్లో పత్తి సాగయింది. పూత దశలో వర్షాలు కురవకపోవడం, ఎండ తీవ్రత పెరగడంతో పూత రాలుతోంది. వర్షాధార భూముల్లో తేమ లేక పంట ఎరుపు రంగులోకి మారుతోంది. ప్రస్తుతం కాయలు చిన్నవిగా ఉన్నందున వాటి పరిమాణం పెరిగితేనే దిగుబడి మెరుగుపడుతుందని రైతులు పేర్కొంటున్నారు. కొత్త పూత రావడం కూడా తక్కువగా ఉండటంతో ఉన్న కాయలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
పెట్టుబడి కూడా కష్టమే..
సాధారణ దిగుబడి 10–12 క్వింటాళ్లు ఉంటే, ఈసారి వర్షాభావ ప్రభావంతో 4–5 క్వింటాళ్లకే పరిమితం కావచ్చు. దిగుబడి సగానికి పడిపోతే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు తిరిగి రావడం కష్టమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ధర తగ్గితే నష్టాలు మరింత పెరుగుతాయి. ప్రస్తుత ధర కొనసాగితేనే కొంతమేర పెట్టుబడిని వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు.
ముధోల్‌లో నీళ్లు లేక ఎర్రబడుతున్న పత్తిని చూపుతున్న రైతులు
ధర నిలిస్తేనే ఊరట
ఒకవైపు దిగుబడి తగ్గే సూచనలు, మరోవైపు ధరపై ఆశలు.. ఈ రెండింటి మధ్య పత్తి రైతులు సీజన్ ఆరంభం కోసం ఎదురుచూస్తున్నారు. దసరా నుంచి జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంభమై, దీపావళి వరకు పత్తి రాక పెరిగే కొద్దీ మార్కెట్ ధర ఎలా ఉంటుందన్నది స్పష్టమవుతుంది. దిగుబడి తగ్గినా ధర తగ్గకుండా కొనసాగితే రైతులకు కొంత ఊరట లభిస్తుంది.


