నిర్మల్‌టౌన్: నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి భద్ర మారు తి, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాల దర్శనానికి ప్రత్యేక బస్సు మంగళవారం బయలుదేరింది. డిపో మేనేజర్ కే. పండరి బస్సును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. 13న బయలుదేరిన ఈ బస్సు తొలుత ఔండా నాగనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటుందని పేర్కొన్నారు. 14న భద్ర మారుతి, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న అనంతరం ఎల్లోరా గుహలను సందర్శిస్తారని తెలిపారు. అక్కడి శివాలయాన్ని దర్శించుకుని, ఔరంగాబాద్‌లోని మినీ తాజ్‌మహల్‌గా పేరొందిన బీబీ కా మక్బరాను సందర్శిస్తారని వివరించారు. యాత్ర ముగించుకుని 15 ఉదయం 4 గంటలకు నిర్మల్ చేరుకుంటుందని చెప్పారు.
27న ఆరు జ్యోతిర్లింగాల యాత్ర
ఈనెల 27న గుజరాత్ యాత్రకు మరో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ పండరి తెలిపారు. ఆరు జ్యోతిర్లింగాల దర్శనానికి గతంలో ఏర్పాటు చేసిన యాత్రకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ఈ నెల 27న మధ్యాహ్నం 1.30 గంటలకు మరో బస్సు బయలుదేరుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ యా త్రకు ఇంకా 10 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి ఉన్నవారు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. రిజర్వేషన్లకు 9959226003, 9440018549 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.


