ఎస్సీ, ఎస్టీ రైట్స్‌ ప్రొటక్షన్‌ సొసైటీ జిల్లా కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ రైట్స్‌ ప్రొటక్షన్‌ సొసైటీ జిల్లా కార్యవర్గం

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

నిర్మల్‌టౌన్‌/ఖానాపూర్‌: ఆల్‌ ఇండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్‌ ప్రొటక్షన్‌ సొసైటీ నిర్మల్‌ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్మల్‌ టీఎన్జీవో భవన్‌లో మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర ఇన్‌చార్జి అధ్యక్షుడు నిర్మల శివరాజ్‌, ప్రధాన కార్యదర్శి రాచూరి చంద్రశేఖర్‌ ముఖ్య అతిథులుగా హాజరై సంఘ నియమాలను ప్రకటించారు. ఎన్నికల అధికారి, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు సామెర్ల రాజన్న ఆధ్వర్యంలో జరిగిన ఎన్ని కల్లో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా డి.రాములు, అధ్యక్షుడిగా బేర పరమేశ్‌, ప్రధాన కార్యదర్శిగా దామెర లక్ష్మీనర్సయ్య, కోశాధికారిగా రాచర్ల రాజేశ్వర్‌ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా కె.రాజలింగం(అడ్వకేట్‌), వెలమల ప్రభాకర్‌, మూడుసు మారన్న, మైపాల్‌ ప్రభుదాస్‌, బి.అంబేద్కర్‌ కుమార్‌, పడిగెల రాజేశ్వర్‌ ఎంపికయ్యారు. ప్రచార కార్యదర్శిగా దుర్గే అనంతరావు, కార్యదర్శిగా మాడవి నాగరావు, ఉపాధ్యక్షులుగా పులి రమేశ్‌, గుండెల్లో దత్తురాం, జడ ఇందూరు ఎన్నికై నట్లు ఎన్నికల అధి కారి సామెర్ల రాజన్న ప్రకటించారు. కార్యక్రమంలో ఆల్‌ ఇండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ సభ్యులు, అంబేడ్కర్‌ వాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement