నిర్మల్టౌన్: మొబైల్ ఫోన్ పొతే ఆందోళన వద్దని, పోలీస్ స్టేషన్లో లేదా మీసేవ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. https://www.ceir.gov.in/ వెబ్ పోర్టల్ ద్వారా ఫోన్ ఆచూకీ తెలుసుకోవడం చాలా సులభమన్నారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న రూ.13.80 లక్షల విలువైన 115 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ వైబ్సెట్ ద్వారా గుర్తించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో మంగళవారం బాధితులకు అందజేశారు. మార్కెట్లో చౌకగా వస్తుందని, సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనే ముందు సీఈఐఆర్ వెబ్సైట్లో ఆ ఫోన్ఐఎంఈఐ నంబర్ నమోదు చేసుకోవాలన్నారు. దొంగతననికి లేదా ఫోన్లను వెతికి పెట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పలు రకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు పోయిన 2,492 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామని తెలిపారు.


