ఢిల్లీలో సీఎంను కలిసిన ఎమ్మెల్యే బొజ్జు | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో సీఎంను కలిసిన ఎమ్మెల్యే బొజ్జు

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

ఖానాపూర్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఖానాపూర్‌ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌ మంగళవారం ఢిల్లీలో కలిశారు. ఎమ్మెల్సీ దండే విఠల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, ఆసిఫాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యామ్‌నాయక్‌ తదితరులతో కలిసి ఈ భేటీలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలు, పార్టీ శ్రేణుల భాగస్వామ్యం, ప్రజల స్పందన తదితర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement