బాసర: బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ట్రిపుల్ఐటీ)లో దసరా నవరాత్రుల సందర్భంగా మంగళవారం ఆయుధ పూజ నిర్వహించారు. వర్సిటీలోని అన్ని విభాగాల్లో నిర్వహించిన పూజల్లో ల్యాబ్ సిబ్బంది, అధ్యాపకులు, విభాగాధిపతులు, అధికారులు పాల్గొన్నారు. సంప్రదాయంలో భాగంగా అన్ని భవనాల ప్రధాన ద్వారాలను పూలతో అందంగా అలంకరించి, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టి విశ్వవిద్యాలయ అభివృద్ధి, సిబ్బంది సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు కాంక్షించారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆయుధ పూజ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.


