నిర్మల్ రూరల్: ఆరుతడి పంటల సాగుతో ఎల్‌నినో ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌తో కలిసి రైతు వేదికల ద్వారా కలెక్టర్లు, అధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం సోమవారం నిర్వహించారు. నిర్మల్ మండలం న్యూపోచంపాడ్ రైతు వేదిక నుంచి కలెక్టర్ భవేశ్‌మిశ్రా పా ల్గొన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉందని, రైతులంతా తక్కువ నీటితో, స్వల్ప కాలంలో పండే పంటలు వేసుకోవాలని సూచించారు. నూనె గింజలు, పప్పు దినుసులు సాగు చేయాలని సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశా రు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ వీబీజీ రామ్‌జీ పథకం కింద పని పొందాలని సూచించారు. విద్యుత్ వినియోగం గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిందన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, తదనుగుణంగా రైతులు, అధికారు ల సూచనల మేరకు తమ సాగు ప్రణాళికలు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన పంటల అధికారి రమణ, డీఆర్డీవో విజయలక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ రమేశ్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో సుధాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు భీమ్‌రెడ్డి, షిండే ఆనంద్‌రావు పటేల్, ఆత్మ చైర్మన్ రామ్‌రెడ్డి పాల్గొన్నారు.


