గాయత్రీదేవిగా అడెల్లి పోచమ్మ | - | Sakshi
Sakshi News home page

గాయత్రీదేవిగా అడెల్లి పోచమ్మ

Oct 13 2026 12:11 AM | Updated on Oct 13 2026 12:11 AM

సారంగపూర్‌: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి హారతి, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు మహా కుంకుమార్చనలో పాల్గొన్నారు.

తూకంలో మోసం చేస్తే కఠిన చర్యలు

లోకేశ్వరం: ప్రతీ విక్రయదారుడు తూనికలు కొలతల నిబంధనలు పాటించాలని జిల్లా తూనికల కొలతశాఖ అధికారి శంకర్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఓ పెట్రోల్‌ బంక్‌, కిరాణ షాపును సోమవారం తనిఖీ చేశారు. వ్యాపారులు త్రాసులకు ఏడాదికోసారి సీల్‌ వేయించుకొవాలన్నారు. తూకంలో మోసం చేస్తే వెంటనే శాఖ అధికారులకు సమచారం అందించాలన్నారు. తూకంలో మోసం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా తూనికల కొలతల శాఖ టీఏ రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement