గ్రామీణాభివృద్ధి నిధులు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

గ్రామీణాభివృద్ధి నిధులు ఇవ్వండి

Oct 13 2026 12:11 AM | Updated on Oct 13 2026 12:11 AM

బాసర: ముధోల్‌ నియోజకవర్గ గ్రామీణ అభివృద్ధి పనుల నిధులు, సుదీర్ఘకాలంగా నిలిచిపోయి న బిల్లులు విడుదల చేయాలని ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ కోరారు. ఈమేరకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ను సోమవారం కలిసి నియోజకవర్గ సమస్యలు, రోడ్ల దుస్థితిపై చర్చించారు. సమగ్ర వినతిపత్రం అందజేశారు. వీబీజీ రామ్‌జీ పథకం కింద మెటీరి యల్‌ చెల్లింపుల ద్వారా రైతులకు సౌకర్యంగా పొలంబాట పనులు చేపట్టాలని ఆయన కోరా రు. ఇప్పటికే పూర్తయిన సీసీ రోడ్లు, మురికి కాలు వలు, ఐకేపీ భవనాలు, నూతన గ్రామపంచాయ తీ భవనాల బిల్లులు రాక కాంట్రాక్టర్లు, సర్పంచులు ఇబ్బంది పడుతున్నారని, వాటిని క్లియర్‌ చేయాలని కోరారు. గ్రామీణ ప్రజలు, రైతులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అవసరమని, చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. నూతన రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. కమిషనర్‌ సానుకూలంగా స్పందిస్తూ, నిధుల విడుదల, పనుల సాధ్యాసాధ్యాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement