‘స్వర్ణ’ మరమ్మతులను అడ్డుకున్న రైతులు | - | Sakshi
Sakshi News home page

‘స్వర్ణ’ మరమ్మతులను అడ్డుకున్న రైతులు

Oct 11 2026 11:43 PM | Updated on Oct 11 2026 11:43 PM

సారంగపూర్‌: గత వేసవిలో స్వర్ణ ప్రాజెక్టు మధ్య కాలువ షట్టరు విరిగిపోయింది. సాగునీరు వృథాగా గోదావరి పాలైంది. ఎట్టకేలకు అధికారులు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఇటీవల ఆలూరు, బోరిగాం గ్రామాల రైతులు తమ పంటలకు నీరందడం లేదని కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేయగా స్పందించిన నీటిపారుదల శాఖ డీఈ అనిల్‌ షట్టరు మరమ్మతులు చేయించేందుకు ఆదివారం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పరిసర గ్రామాల రైతులు షట్టరుకు మరమ్మతులు చేయించాల్సిన సమయంలో చేయించకుండా ఇప్పుడెలా చేస్తారని నిలదీశారు. ఒకవేళ షట్టరు కిందకు దిగని పక్షంలో ప్రస్తుతం ఉన్న కొద్ది నీరు కూడా వృథాగా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరమ్మతు పనులు నిలిపివేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎల్‌నినో ప్రభావంతో ఈయేడాది ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండలేదని తెలిపారు. మరమ్మతుల పేరుతో ఉన్న కొద్దిపాటి నీటిని వృథా చేయొద్దని కోరారు. నీరు వృథాగా పోతే బావులు, బోర్లు కూడా ఎండిపోతాయని అన్నారు. దీంతో అధికారులు వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement