● శరన్నవరాత్రుల వేళ బంగల్‌పేట్ మహాలక్ష్మికి భక్తుడి చిరుకానుక
నిర్మల్‌ఖిల్లా: శరన్నవరాత్రి పర్వదినాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బంగారుపేట మహాలక్ష్మి అమ్మవారికి ఓ భక్తుడు ప్రత్యేకంగా వెండి విగ్రహంతో కూడిన ముత్యాల హారం తయారు చేయించాడు. ఈ హారాన్ని ఎరుపు, ఆకుపచ్చ గుండ్లతోపాటు వెండి ప్రతిమను జోడించి ఆకర్షణీయంగా రూపొందించారు. బేస్తవార్‌పేట్‌కు చెందిన దొండి శ్రీనివాస్ అమ్మవారిపై తనకున్న భక్తి, విశ్వాసంతో ఈ ప్రత్యేక హారాన్ని తయారు చేయించారు. మహాలక్ష్మి అమ్మవారికి ఈ హారాన్ని త్వరలో సమర్పించనున్నట్లు శ్రీనివాస్ తెలిపాడు.


