నిర్మల్‌టౌన్: జిల్లాలో పత్తి కొనుగోళ్లు సజావుగా చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పత్తి కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పత్తి సాగు, దిగుబడి అంచనా వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ నమోదు చేసుకుని రైతులు తమ పంటను అమ్ముకోవాలని సూచించారు. రైతులు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, సీసీఐ అధికారులు శరత్, వ్యవసాయ అధికారి సుజాత, జిల్లా మార్కెటింగ్ అధికారి గంగు, వివిధ వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు భీమ్‌రెడ్డి, షిండే ఆనంద్‌రావుపటేల్, కళ్యాణ్, భైంసా ఏఎంసీ వైస్ చైర్మన్ ఫారూఖ్ సిద్ధిఖి తదితరులు పాల్గొన్నారు.
పుష్కరాల పనులపై నిరంతర పర్యవేక్షణ..
గోదావరి పుష్కరాల పనులపై నిరంతర పర్యవేక్షణ కోసం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం పకడ్బందీగా పని చేయాలని కలెక్టర్ తెలిపారు. అన్ని పుష్కరఘాట్ల వద్ద ఆయా నిర్మాణ పనులు నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. సీపీవో గంగారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి రమణ, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ ఈఈ అనిల్, సుభాష్ తదితరులు ఉన్నారు.
పారదర్శకంగా అంగన్‌వాడీ టీచర్ల భర్తీ
జిల్లాలో 89 అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీ అవకతవకలకు తావులేకుండా, పారదర్శకంగా నిర్వహించాలనికలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారుల ను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులతో అంగన్‌వాడీ టీచర్ల పోస్టుల భర్తీ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా అందిన దరఖాస్తులు, అర్హతల పరిశీలన, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితర అంశాలపై ఆరాతీశారు. నిబంధనలు పాటిస్తూ, ప్రతీ దశను పారదర్శకంగా నిర్వహించాలని సూ చించారు. భర్తీ ప్రక్రియకు సంబంధించిన సమాచారం, తదుపరి దశల వివరాలను దరఖాస్తుదా రులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. దరఖాస్తుదారులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి వినూత్న, సీడీపీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


