రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సమీక్ష

Oct 7 2026 11:43 PM | Updated on Oct 7 2026 11:43 PM

నిర్మల్‌టౌన్‌: రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రత మెరుగుదల, జీరో ఫాటాలిటీ జిల్లా లక్ష్యంగా డీజీపీ ఆధ్వర్యంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ఇళంబర్తి ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి ఎస్పీ జానకీ షర్మిల పాల్గొన్నారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, బ్లాక్‌స్పాట్లు, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలపై చర్చించారు. ప్రమాదాలకు కారణాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని, పోలీస్‌, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రమాదాలు, బ్లాక్‌స్పాట్లు, భద్రతా చర్యల వివరాలను ‘సేఫ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌–మార్గదర్శక్‌’ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. ఇందులో డీఎస్పీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement