అటు భక్తి.. ఇటు భుక్తి | - | Sakshi
Sakshi News home page

అటు భక్తి.. ఇటు భుక్తి

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

మంగళవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

వినాయక నవరాత్రోత్సవాలతో పలువురికి ఉపాధి విగ్రహ తయారీ నుంచి నిమజ్జనం వరకు.. వేల మందికి చేతినిండా పని

నిర్మల్‌

భైంసా: హిందూ పండుగల్లో ముఖ్యమైన పండుగ వినాయక నవరాత్రి ఉత్సవాలు. వినాయక నవరా త్రి వేడుకలు కేవలం భక్తి, ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితం కావు. ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు అనేక కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. పండుగ సీజన్‌లో చిన్న వ్యాపారుల నుంచి కళాకారుల వరకు విస్తృత వర్గాలకు అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటున్నాయి.

విగ్రహ తయారీ నుంచి

మండపాల అలంకరణ వరకు

వినాయక విగ్రహాల తయారీతో ప్రారంభమై మండపాల డెకరేషన్‌, లైటింగ్‌, టెంట్‌హౌస్‌ ఏర్పాట్లు వంటి పనులు వేల మందికి ఉపాధి అందిస్తున్నాయి. శిల్పులు, అలంకరణ నిపుణులు మెరుగైన ఆదాయం పొందుతున్నారు. అదేవిధంగా వస్త్రాలు, రంగులు, పూజా సామగ్రి అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. వాహనాలు, డ్రైవర్లు, అర్చకులు, టపాసులు, డప్పు కళాకారులు, కోలాటం, నృత్యకారులు తదితర రంగాలవారికి ఉపాధి లభిస్తుంది.

ఆహారం, అర్చకులు, వాహనాల

యజమానులు, డ్రైవర్లకు డిమాండ్‌..

లడ్డూ తయారీ, స్వీట్‌హౌస్‌లు, వంట మనుషులు వంటి ఆహార సంబంధిత వృత్తులకు ఈ సీజన్‌లో ప్రత్యేక గిరాకీ ఏర్పడుతోంది. అర్చకులు, పూజా కార్యక్రమాల నిర్వహణలో నిమగ్నమైనవారు కూడా ఎక్కువ పని అవకాశాలు పొందుతున్నారు. వాహనాల అద్దె, రవాణా సేవలు కూడా పండుగ కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి.

కళాకారులు, వినోద రంగం

డప్పు కళాకారులు, మహారాష్ట్ర బ్యాండ్‌, మైక్‌సెట్‌, డీజే వంటి వినోద సేవలు అందించేవారికి ఈ తొమ్మిది రోజులు ప్రత్యేక ఆదాయ కాలంగా మారుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు వీరికి నిరంతర పని అవకాశాలు కల్పిస్తున్నాయి.

ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం

ఈ ఉత్సవాలు మతాలకు అతీతంగా స్థానిక వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు, కళాకారుల జీవనోపాధికి దోహదం చేస్తున్నాయి. పండుగ సీజన్‌లో పెరిగిన డిమాండ్‌ వల్ల అనేక కుటుంబాలు అదనపు ఆదాయం సంపాదించుకోగలుగుతున్నాయి. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తోంది. మొత్తంగా వినాయక నవరాత్రి వేడుకలు సంప్రదాయాలను కాపాడుతూనే వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి.

విగ్రహాల తయారీతో ఉపాధి

వినాయక చవితికి మూడు నెలల ముందు నుంచే విగ్రహాల తయారీ ప్రారంభిస్తాం. మట్టి, రంగులు, అలంకరణ సామగ్రి తెచ్చుకుని కుటుంబ సభ్యులంతా కలిసి పనిచేస్తాం. పండుగ సమయంలో వచ్చే ఆదాయం మాకు ఎంతో ఉపయోగపడుతుంది.

– గోపి, విగ్రహ తయారీదారుడు

మైక్‌సెట్‌.. డీజేలకు..

మండపాల్లో పూజలు, భక్తి కార్యక్రమాలకు మైక్‌సెట్లు అవసరం. శోభాయాత్రలకు సౌండ్‌ సిస్టమ్‌, డీజేలకు కూడా బుకింగ్‌లు వస్తున్నాయి. మండపాల వద్ద నీడ కోసం టెంట్‌, షామియానాలు, అన్నదానాలకు బాసన్లు చవితికి పది రోజుల ముందే బుకింగ్‌ చేశారు. – అర్బజ్‌ఖాన్‌, డీజే నిర్వాహకుడు

మాకు మస్తు డిమాండ్‌

విగ్రహాలను మండపాలకు తరలించడం, నిమజ్జనం కోసం ఘాట్‌లకు తీసుకెళ్లడం వంటి పనులకు వాహనాలు అవసరం. పండుగ సమయంలో అద్దెకు వాహనాలకు డిమాండ్‌ పెరుగుతుంది. మాలాంటి డ్రైవర్లకు ఉపాధి దొరుకుతుంది.

– మోహన్‌, ట్రాక్టర్‌ డ్రైవర్‌

0000723507-000001-NZB ADSALES SPO

4.00x8.00

NZB ADSALES SPOT PAYMENT ACCOUNT

నిర్మల్‌లో నిమజ్జన ఏర్పాట్లు పరిశీలిస్తున్న మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గణేశ్‌ చక్రవర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement