మండపాలతోపాటు శోభాయాత్ర జరిగే మార్గాల్లోనూ విద్యుత్ అలంకరణలు చేస్తున్నారు. పండుగ సమయంలో సాధారణ రోజుల కంటే ఎక్కువ పని ఉంటుంది. వినాయక చవితితోనే మాకు ఉపాధి పెరుగుతుంది. తర్వాత దసరా, దీపావళి వరకు ఉపాధి దొరుకుతుంది.
– సాయికుమార్, లైటింగ్ మెన్
క్రేన్‌లకు ఉపాధి..
భారీ విగ్రహాలు రావడంతో క్రేన్‌లకు ఉపాధి దొరుకుతుంది. విగ్రహాల ప్రతిష్టాపన సమయంలోనూ చేతి నిండా పని ఉంటుంది. ఇక విగ్రహాలు నిమజ్జనం సమయంలోనూ బిజీగా ఉంటున్నాం. ఏటా ఉత్సవాలతో ఉపాధి దొరుకుతుంది. – రాజుఖాన్, క్రేన్ నిర్వాహకుడు
అర్చకులు బిజీ..
మండపాల్లో ప్రతిరోజూ పూజలు, హారతులు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో పూజా స్టోర్ల నిర్వాహకులకు ఆదాయం వస్తుంది. ఇక పండుగ రోజుల్లో అర్చకులకు కూడా అదనపు పని లభిస్తోంది. చవితి రోజుల్లో పెళ్లిళ్లు ఉండవు. దీంతో అర్చకులకు వినాయకుడు ఆదాయం ఇస్తున్నాడు.
– దశరథ్, పూజా సామగ్రి విక్రేత


