నిమజ్జనానికి సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి సర్వం సిద్ధం

Sep 21 2026 6:53 AM | Updated on Sep 21 2026 6:53 AM

● శాంతియుతంగా సాగేందుకు పటిష్ట ఏర్పాట్లు ● ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్‌, ఎస్పీ సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 ● ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్‌ వెంకట్రావు

న్యూస్‌రీల్‌

నిర్మల్‌

డీఏలు ప్రకటించాలి

ఖానాపూర్‌: ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యా య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్‌ వెంకట్రావు అన్నారు. ఖానాపూర్‌లో ఆదివారం మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు విడుదల చేసి, నూతన పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసరాల ధరలు పెరగడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్థి క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని, ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు భూక్యా రాజేశ్‌నాయక్‌, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్‌, కోశాధికారి రవినాయక్‌ పాల్గొన్నారు.

భైంసా: జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రోత్సవాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వాడవాడలా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు తరలివస్తున్నారు. గణేశ్‌ మండపాల వద్ద నిత్యం భక్తి కార్యక్రమాలు, భజనలు, సాంస్కృతిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిర్వాహకులు అన్నదానాలు చేపడుతుండగా.. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు.

మూడు మున్సిపాలిటీలు, 18 మండలాల్లో..

నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీలతో పాటు 18 మండలాల పరిధిలోని గ్రామాల్లో నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణాలు, గ్రామాల్లోని నిమజ్జన మార్గాలు, చెరువులు, కుంటలు తదితర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. విగ్రహాలు తరలించే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా రహదారుల పరిస్థితిని పరిశీలించి అవసరమైన చోట్ల మరమ్మతులు చేపడుతున్నారు.

విద్యుత్‌ తీగలు, రహదారుల పరిశీలన

శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాల్లో విద్యుత్‌ సమస్యలు రాకుండా ట్రాన్స్‌కో సిబ్బంది చర్యలు చేపట్టారు. రహదారులపై తీగలు, స్తంభాలను పరిశీలించి అవసరమైన చోట్ల సరిదిద్దారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రధాన మార్గాల్లో విద్యుత్‌ దీపాలను కూడా సరిచేస్తున్నారు.

శాంతి కమిటీలు, గణేశ్‌ సమితులతో

సమన్వయం

కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా, ఎస్పీ డాక్టర్‌ జానకీషర్మిల ఉ త్సవాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ నిమజ్జన ఏర్పాట్ల ను పర్యవేక్షిస్తున్నారు. గణేశ్‌ ఉత్సవ సమితులు, క మిటీలు, శాంతి కమిటీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి సూచనలు, సమస్యలను తెలు సుకుంటున్నారు. ప్రజలు, నిర్వాహకులు, వివిధ శా ఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా పూర్తవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. శోభాయాత్ర సమయంలో నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని నిర్వాహకులకు సూచిస్తున్నారు.

ఆధ్యాత్మిక సందడి కొనసాగుతూనే

వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా వినాయక ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లోని మండపాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తుండగా.. పలుచోట్ల అన్నదానాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఉత్సవాలు ప్రశాంతంగా సాగిన నేపథ్యంలో నిమజ్జనాన్ని కూడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌, ట్రాన్స్‌కో, వైద్య, అగ్నిమాపక తదితర శాఖలు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాయి.

పోలీసుల నిఘా, సీసీటీవీ పర్యవేక్షణ

శోభాయాత్ర సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ యంత్రాంగం ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. ప్రధాన మార్గాలు, రద్దీ ప్రాంతాలు, నిమజ్జన ఘాట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు. ట్రాఫిక్‌ సమస్యలు రాకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటుతో పాటు వాహనాల మళ్లింపు చర్యలు కూడా తీసుకోనున్నారు.

ఘాట్ల వద్ద సౌకర్యాలు

నిమజ్జన ఘాట్ల వద్ద భక్తులకు ఇబ్బంది కలుగకుండా మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు. విగ్రహాలు మునిగే ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వెలుగులు, తాగునీరు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జనం అనంతరం వ్యర్థాలు తొలగించేందుకు ప్రత్యేక సిబ్బందిని సిద్ధం చేశారు. గతంలో సమస్యలు ఎదురైన ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. శోభాయాత్ర మార్గాల్లోని గుంతలు, గతుకుల రోడ్లను సరిచేసే పనులపై ప్రత్యేక దృష్టి సారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement