రైస్‌మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలతో జిల్లాలో పదుల సంఖ్యలో మిల్లర్లు రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్లపైనే ధాన్యం పక్కదారి పట్టించినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో తమ డిమాండ్ల సాధనకు ఈనెల 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లర్లు బందు పాటిస్తున్నారు. సమ్మెలో ఉన్న కారణంగా ‘‘ఎవరైనా తనిఖీలు చేయదలచుకుంటే సమ్మె విరమించిన తరువాత రాగలరని’’ మనవి అంటూ ఏకంగా మిల్లుల వద్ద పోస్టర్లు ఏర్పాటు చేయడం విస్తుగొలుపుతోంది. ఓవైపు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైస్‌మిల్లుల్లో తనిఖీలకు ప్రతీ బుధవారం పీవీ(ఫిజికల్ వెరిఫికేషన్ డే) నిర్వహించాలని అధికారులకు సూచించింది. మరోవైపు మిల్లర్లు ఇలా పోస్టర్లు ఏర్పాటు చేయడంతో మరి అధికారులు తనిఖీలు చేస్తారా.. లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. – భైంసాటౌన్


