ముధోల్: మండల కేంద్రం ముధోల్‌లో వినాయకుని నిమజ్జనోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఏడు రోజులు పూజలందుకున్న గణనాథులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో ప్రధాన వీధులగుండా ఊరేగిస్తూ ముందుకు సాగారు. ఎస్పీ జానకీషర్మిల రామ మందిర్‌లో ప్రతిష్టించిన సార్వజనిక్ గణేశ్ వద్ద వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శోభయాత్రను ప్రారంభించారు. అంతకుముందు పోలీసులతో జీఎం ఫంక్షన్‌హాల్‌లో సమావేశం నిర్వహించి బందోబస్తుపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ముధోల్ సీఐ రవీందర్‌నాయక్, ఎస్సై బిట్ల పెర్సిస్, పలువురు ఎస్సైలు, 500 మంది పోలీసులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పూజలు
నిమజ్జన శోభాయాత్రలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ పాల్గొన్నారు. రామమందిరంలో ప్రతిష్టించిన సార్వజనిక్ గణేశ్ వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. గ్రామంలో ప్రతిష్టించిన వినాయక మండపాల వద్దకు వెళ్లి పూజలు చేశారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ ఏజాజొద్దీన్, బోరిగాం సర్పంచ్ కిష్టయ్య, వీడీసీ అధ్యక్షులు విఠల్, వెంకటేశ్, నాయకులు విఠల్, వెంకటేశ్, కోరి పోతన్న, సతీశ్‌రెడ్డి, తాటివార్ రమేశ్, రవికిరణ్‌గౌడ్ ఉన్నారు.


