కొరడి గణేశా.. కోర్కెలు తీర్చవయ్యా | - | Sakshi
Sakshi News home page

కొరడి గణేశా.. కోర్కెలు తీర్చవయ్యా

Sep 21 2026 6:53 AM | Updated on Sep 21 2026 6:53 AM

● ఆదివారం భారీగా తరలివచ్చిన భక్తులు..

భైంసారూరల్‌: మండలంలోని మాటేగాం స్వయంభూ కొరడి గణేశుని దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. సెలవు రోజు కావడంతో ఉదయం నుంచే ఆలయానికి భక్తుల రాక పెరిగింది. నిర్మల్‌ జిల్లాతోపాటు భైంసా, ముధోల్‌, కుబీర్‌, కుంటాల, లోకేశ్వరం, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకుఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, తాగునీటి సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నారు. ఇక ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. చుట్టుపక్కల కళాకారులు కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement