నిర్మల్‌టౌన్: ప్రజావాణిలో అందే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, చట్టపరంగా పరిష్కారం చూపాలని ఎస్పీ జానకీషర్మిల అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై స్పందించాలని సూచించారు. ప్రతీ ఫిర్యాదును బాధ్యతగా పరిశీలించి, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.


