ఖానాపూర్: ఖానాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ట్రాసౌండ్ స్కాన్ యంత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం ప్రారంభించారు. స్కానింగ్ యంత్రాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మౌనిక, వైస్ చైర్మన్ సోయబ్, డీసీహెచ్‌ఎస్ కాశీనాథ్, డీఎంహెచ్‌వో రాజేందర్, సూపరింటెండెంట్ స్వర్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


