విచారణ హైరానా! | - | Sakshi
Sakshi News home page

విచారణ హైరానా!

Sep 11 2026 11:54 PM | Updated on Sep 11 2026 11:54 PM

● ఓటర్ల పరిశీలనలో తీవ్ర జాప్యం ● ఓటర్లు సకాలంలో రాక తేదీల మార్పులు ● ఉమ్మడి జిల్లాలో ‘సర్‌’ ప్రక్రియలో జాప్యం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రత్యేక సమగ్ర పరిశీలన(ఎస్‌ఐఆర్‌)లో అన్‌మ్యాపింగ్‌, అనామలీస్‌ ఓటర్ల పరిశీలనతో బీఎల్‌వోలు, అధికారులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ఓటర్లకు నోటీసుల జారీ నుంచి విచారణ(హియరింగ్‌) చేపట్టడం వరకు ప్రయాసగా మారింది. ఓటర్లకు తగిన రుజువులు లేకపోతే మరోసారి రావడం, ఓటర్లు నిర్ణీత సమయంలో బీఎల్‌వోల ముందు హాజరు కావడం లేదు. ఆ తేదీలు రద్దు(ల్యాప్స్‌) అవుతున్నాయి. బీఎల్‌వోలు ప్రతీ ఓటరు ఫొటో తీసుకుని యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. దీంతో చాలా చోట్ల వేలాది మంది ఓటర్ల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. ఒక్కో రోజు ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సగటున కనీసం వెయ్యికిపైనే ఓటర్ల పరిశీలన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొందరు తగిన రుజువులు తీసుకురాకపోవడంతో మళ్లీ మళ్లీ హియరింగ్‌ ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. వృద్ధులు, మహిళలకు చాలామంది పదో తరగతి మా ర్కుల మెమో, బ్యాంకు పాస్‌బుక్‌, లేదా కుల ధ్రువీ కరణలు అడుగుతున్నారు. ఆధార్‌, పాన్‌, రేషన్‌ కార్డులు ఆమోదించక ఇబ్బందులు వస్తున్నాయి.

గడువులోపు పూర్తయ్యేనా?

ప్రస్తుతం ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం ఓటర్ల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ కొనసాగుతోంది. అదే సమయంలో ఓటర్ల తప్పులను సరి చేస్తున్నారు. వేలాది ఓటర్లకు నోటీసుల జారీ, హియరింగ్‌, తేదీలు, బీఎల్‌వోలు ధ్రువపత్రా ల పరిశీలన నుంచి ఆర్వోలు, ఎన్నికల సిబ్బంది, జిల్లా ఎన్నికల అధికారుల వరకు పరిశీలన చేయా లి. దీంతో గడవులోపు సర్‌ ప్రక్రియ పూర్తవుతుందా? అనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నిక ల కమిషన్‌ తుది జాబితా ప్రచురణకు అక్టోబర్‌ 15నుంచి నవంబర్‌ 9వరకు గడువు పొడగించింది.

నియోజకవర్గాల వారీగా నోటీసుల వివరాలు

ని.వర్గం నోటీసులు జారీ చేసింది పెండింగ్‌ హియరింగ్‌ హియరింగ్‌ ల్యాప్స్‌

సిర్పూర్‌ 53,245 37,474 15,771 7,564 17,081

ఆసిఫాబాద్‌ 52,647 30,990 21,657 6,608 14,398

చెన్నూరు 57,380 43,445 13,935 1,586 39,674

బెల్లంపల్లి 45370 39,629 5,741 1,828 21,344

ఆదిలాబాద్‌ 85525 23,596 61,929 3,339 56,722

బోథ్‌ 64,900 54,386 10,514 10,671 32,762

ఖానాపూర్‌ 68,052 62,436 5,616 13,964 25,462

నిర్మల్‌ 83,370 65,818 17,552 14,377 57,800

ముథోల్‌ 70,581 65,348 5,233 20,019 28,582

మంచిర్యాల 68,218 43,481 24,737 10,019 16,407

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement