గణేశ్‌ మండపాలకు అనుమతి తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ మండపాలకు అనుమతి తప్పనిసరి

Sep 11 2026 11:54 PM | Updated on Sep 11 2026 11:54 PM

● పోలీస్‌ పోర్టల్‌లో వివరాల నమోదు ● విద్యుత్‌.. ఫైర్‌ సేఫ్టీపై దృష్టి

భైంసా: గణేశ్‌ ఉత్సవాలకు మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందస్తుగానే అవసరమైన దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మండపాల ఏర్పాటు, విద్యుత్‌ సరఫరా, అగ్నిమాపక భద్రత, ఊరేగింపు, నిమజ్జనం వంటి అంశాల్లో నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా, ఎస్పీ డాక్టర్‌ జానకీషర్మిల ఉత్సవ సమితుల సభ్యులతో సమీక్ష నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. మండల స్థాయిలోనూ అధికారులు గణేశ్‌ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి ముందస్తు చర్యలపై అవగాహన కల్పించాలని సూచించారు.

విద్యుత్‌ కనెక్షన్‌ ముందుగానే

మండపాలకు తాత్కాలిక విద్యుత్‌ సరఫరా కోసం సంబంధిత విద్యుత్‌ శాఖకు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా వైరింగ్‌ ఏర్పాటు చేయాలి. అనధికారిక కనెక్షన్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఫైర్‌ సేఫ్టీ చర్యలు తప్పనిసరి

అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచడంతో పాటు విద్యుత్‌ తీగలు, అలంకరణ సామగ్రిని సురక్షితంగా ఏర్పాటు చేయాలి. అత్యవసర సమయంలో బయటకు వెళ్లేందుకు మార్గం ఉండేలా చూడాలి.

ఊరేగింపు వివరాలు తెలియజేయాలి..

గణేశ్‌ నిమజ్జన ఊరేగింపు మార్గం, సమయం తది తర వివరాలను పోలీసులకు ముందుగానే తెలియజేయాలి. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు శాంతిభద్రతలకు విఘా తం కలగకుండా పోలీసుల సూచనలు పాటించాలి. చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా మండపాల నిర్వాహకులు అన్ని ప్రక్రియలను ముందుగా నే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

మండల స్థాయిలో సమావేశాలు

జిల్లా స్థాయిలో ఇప్పటికే గణేశ్‌ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులతో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో మండలస్థాయి అధికారులు కూడా స్థానిక ఉత్సవ సమితులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీస్‌ పోర్టల్‌లో నమోదు, విద్యుత్‌ సరఫరా, ఫైర్‌ సేఫ్టీ తదితర అంశాలపై నిర్వాహకులకు అవగాహన కల్పించనున్నారు.

పోలీస్‌ పోర్టల్‌లో నమోదు

మండపాల నిర్వాహకులు తెలంగాణ పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక పోర్టల్‌ htt p//policeportal.tspolice.gov.in/ index.htm ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు న మోదు చేయాలి. పోర్టల్‌లో మండపం ఏర్పా టు చేసే ప్రాంతం, నిర్వాహకుల వివరాలు, విగ్రహ ఏర్పాటు, ఊరేగింపు, నిమజ్జనం తదితర సమాచారాన్ని నమోదు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement