న్యూస్‌రీల్
నిర్మల్
కాళోజీకి ఘన నివాళి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజాకవి కాళోజీ నారాయణరా వు జయంతిని బుధవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు క లెక్టర్ వెంకటేశ్వర్లు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ యాసలో తాను రాసిన కవితలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారని కొనియాడారు. ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకొంటున్నామని గుర్తు చేశారు. కార్యక్రమంలో డీఆర్వో రాథోడ్ రమేశ్, బీసీ, ఎస్సీ సంక్షేమాధికారులు శ్రీనివాస్, దయానంద్, హార్టిక ల్చర్ అధికారి రమణ, ఎల్డీఎం రామ్‌గోపాల్, అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: ఎల్పీజీ దిగుమతుల్లో నెలకొన్న అనిశ్చితి జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్యాస్ కొరత, రీఫిల్ బుకింగ్ గడువు పెంపు ప్రభావం కొత్త కనెక్షన్ల డిమాండ్‌ను ఒక్కసారిగా పెంచేసింది. మార్చి నుంచి చమురు సంస్థలు కొత్త కనెక్షన్ల జారీని నిలిపివేశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో బుకింగ్ కోసం 45రోజుల గడువు విధించగా ఇటీవల 25రోజులకు కుదించారు. అమెరికా–ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గినా ఆ ప్రభావం ఇంకా గ్యాస్ సిలిండర్ల సరఫరాపై పడుతోంది. గతంలో ఒక్క రోజులోనే కొత్త కనెక్షన్‌తో పాటు డబుల్ సిలిండర్ కూడా మంజూరయ్యేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా నూతన గ్యాస్ కనెక్షన్లు, రెండో సిలిండర్ల మంజూరు నిలిపివేశారు. ఈ నిబంధనలతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఇదే అదనుగా బహిరంగ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లకు భారీ డిమాండ్ ఉంది.
యుద్ధం ముగిసినా నిరీక్షణే..
ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకో సిలిండర్ తప్పనిసరి అవుతోంది. అయితే, ప్రస్తుతం అమలవుతున్న గడువుతో వినియోగదారులకు నిరీక్షణ తప్పడం లేదు. బుకింగ్ చేసినా ఫలితం ఉండటం లేదు. కొత్త కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నవారు సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందా? అని ఆశగా నిరీక్షిస్తున్నారు. యుద్ధం ముగిసినప్పటి కీ మరికొన్ని రోజులు వేచి చూడాలని అధికారులు చెబుతున్నారు. కనెక్షన్లు లేని వారు గ్యాస్ వాడకం తక్కువగా ఉన్నవారి వద్ద ఓటీపీ తీసుకుని ఎంతో కొంత ముట్టజెప్పి సిలిండర్లు తీసుకుంటున్నారు.
పని చేయని వెబ్‌సైట్
నూతన కనెక్షన్ ఇవ్వాలని, ఒక సిలిండర్ ఉన్నవారు మరొకటి కావాలని గృహావసరాల వినియోగదారులు ఏజెన్సీలకు దరఖాస్తులు అందిస్తున్నా.. నాలుగు నెలలుగా వెబ్‌సైట్ పని చేయకపోవడంతో డీలర్లూ ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది. నూతనంగా వివాహం చేసుకున్న జంటలకు గ్యాస్ కనెక్షన్ తలనొప్పిగా మారింది. పెళ్లయిన వారు, ఇతర కారణాలతో వేరే కాపురం పెడుతున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లపై ఆధారపడాల్సి వస్తోంది.
కొత్త కనెక్షన్ ఇవ్వాలి
సింగిల్ సిలిండర్‌తో ఇబ్బందవుతోంది. బుకింగ్‌కు సమయం ఎక్కువగా పడుతోంది. సింగిల్ కనెక్షన్‌దారులకు రెండో సిలిండర్ ఇవ్వాలి. గ్యాస్ ఏజెన్సీలు కొత్త కనెక్షన్లు ఇచ్చేలా అధికారులు చొరవచూపాలి.
– దాసరి సాయికృష్ణ, నిర్మల్
మా పరిధిలో లేదు
గ్యాస్ కొత్త కనెక్షన్లు మంజూరు చమురు సంస్థలు నిర్ణయించాల్సి ఉంది. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత కొద్దిరోజులుండే. కానీ, ఇప్పుడు సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త కనెక్షన్లు ఇవ్వాలా? వద్దా? అనేది మా నిర్ణయం కాదు.
– రాజేందర్, డీసీఎస్వో


