కుంటాల: మండలంలోని ఓల శివారులోని రైతు కృష్ణారావు సాగు చేస్తున్న సోయా పంటను బుధవారం పలువురు పరిశీలించారు. హైదరాబాద్ ప్రొఫెసర్ అజయ్‌శంకర్, తెలంగాణ విశ్వవిద్యాలయ విత్తన కేంద్రం పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ బలరాం, డాక్టర్ రాజేందర్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం నిర్మల్ శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ రైతులకు పలు సూచనలు చేశారు. సస్యరక్షణ చర్యలు చేపడితేనే అధిక దిగుబడి సాధ్యమని తెలి పారు. సోయాలో పండాకు, ఆకుమచ్చ తెగుళ్ల ను గుర్తించి నివారణ చర్యలు సూచించారు. ఏ ఈవోలు శ్రీనివాస్, హర్షిత తదితరులున్నారు.


