నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని రాష్ట్ర యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. పర్యాటక ప్రాధాన్యత క లిగిన ప్రాంతాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకోసం జిల్లాకు నోడ ల్ పర్యాటక అధికారిని నియమించాలని తెలిపారు. పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. అన్ని పర్యాటక ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం, రవాణా, మరుగుదొ డ్లు, పార్కింగ్, పారిశుద్ధ్యం, సీసీ కెమెరాలు, భద్రత తదితర మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆదేశించారు. సినిమాల చిత్రీకరణకు అనువైన ప్రకృతి, చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను గుర్తించి అవసరమైన సదుపాయాలతో అభివృద్ధి చేయాలని పే ర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, విద్యార్థులకు పర్యాటక రంగంపై వ్యాసరచన, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహించాలని సూచించారు. వీసీలో కలెక్టర్ భవేశ్ మిశ్రా, డీఆర్వో రాథోడ్ రమేశ్, డీపీవో శ్రీనివాస్, డీఐఈవో పరశురామ్, డీవైఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిష్టర్లు పరిశీలించారు. సీసీ కెమెరాలు, అగ్నిమాపక వ్యవస్థ పనితీరును తనిఖీ చేశారు. గోదాం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న భద్రత సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు గండ్రత్ రమేశ్, సిరికొండ రమేశ్, మజార్, ముజాహిద్, కోరిపెల్లి శ్రావణ్‌రెడ్డి, అజార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


